Monday, May 20, 2024

చిరంజీవితో బ్రేక్ ఫాస్ట్.. ఫొటో పోస్ట్ చేసిన డీఎస్పీ

మెగాస్టార్ చిరంజీవితో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోని పోస్ట్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్..కాగా ఆయ‌న మెగాస్టార్‌ చిరంజీవి ని కలిశారు. బాస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫొటో షేర్ చేశారు డీఎస్పీ. మధురమైన బ్రేక్‌ఫాస్ట్‌, అద్భుతమైన సమయం. మేం ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకు ఎప్పుడూ చాలా చాలా ప్రత్యేకం. లవ్‌ యూ సార్‌. ఇలాంటి అందమైన ఫొటో తీసిన సురేఖ గారికి ధన్యవాదాలు..బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు డీఎస్పీ. ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరూ ఇలా కలుసుకోవడం వెనుకున్న సీక్రెట్‌ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి ఆ సీక్రెట్‌ ఏంటో తెలియజేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement