Thursday, May 2, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో బాలీవుడ్ స్టార్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తీసుకోబోతున్నట్లు గా టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే అది ఎవరు ఏంటి అనేదానిపై ఇప్పుడు అంతా ఆసక్తి నెలకొంది. ఇక సంగీతం విషయానికొస్తే అనిరుద్ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. మరి చూడాలి వీటన్నింటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement