Sunday, May 5, 2024

Nabha natesh: బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ నభా నటేష్ సోగసు మంటలు

ఒకప్పుడు హీరోయిన్లు ఫాలోయింగ్‌ను పెంచుకోవాలంటే వరుసగా సినిమాల్లో నటించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎంతో మంది భామలు సినిమాలు చేయకున్నా హైలైట్ అవుతూనే ఉన్నారు. అందులో కన్నడ పిల్ల నభా నటేష్ ఒకరు.


అందచందాలతో హైలైట్ అయింది. దీంతో ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా ‘వజ్రకాయ’ అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కూడా శాండిల్‌వుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో నభా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది
మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు లాగేసుకున్న నభా నటేష్‌కు ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ వెంటనే ‘అదిగో’ అనే చిత్రంలో నటించింది. అనంతరం నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలోనూ చేసింది. ఈ క్రేజీ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది..’ఇస్మార్ట్ శంకర్’ తర్వాత కూడా నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ వంటి చిత్రాల్లో నటించింది. వీటి ద్వారా సత్ఫలితాలనే సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎందుకనో సిని కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది. అప్పటి నుంచి నభా ఖాళీగానే ఉంటోంది. దీంతో నభా నటేష్ గ్లామర్ షో కి తెరతీసింది.. బ్లాక్ అండ్ వైట్ అందాలతో షేర్ చేసిన బోల్డు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement