Sunday, April 28, 2024

బర్త్ డే స్పెషల్….కేజీఎఫ్2 రావురమేష్ లుక్ రిలీజ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద కు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు వసూళ్ల మోత మోగించింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది.. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాను మొదట జూలై 16న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.కానీ కరోనా కారణంగా అది సాధ్యమయ్యేలా కనిపించడంలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా… ఈ సినిమాలో రావు రమేష్ లుక్ కి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

రావు రమేష్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన పోస్టర్ లో సిబిఐ అత్యున్నత అధికారి కన్నెగంటి రాఘవన్ పుట్టినరోజు ఈ రోజు. ఇప్పుడు సిబిఐ ఇంటరెస్ట్ ఏమిటి ? కేజిఎఫ్ లేదా రాకీనా ? నరాచి సున్నపురాయి కార్పొరేషన్ వెనుక సత్యాన్ని ఆవిష్కరించడంలో రాఘవన్ విజయం సాధిస్తారా అనే హెడ్ లైన్స్ కేజీఎఫ్ టైమ్స్ మొదటిపేజీలో ప్రచురించ బడ్డాయి.

https://twitter.com/prashanth_neel/status/1397047345418706946?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement