Thursday, May 16, 2024

బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్…కారణం ఏంటో తెలుసా ?

తమిళ్ ఇండస్ట్రీ నుంచి దళితులను తరిమివేయాలని బిగ్ బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దళితులను కించపర్చేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. హాజరు కాకపోతే అరెస్ట్ అవుతుంది అంటూ హెచ్చరించారు.

దీనిపై ఆమె స్పందిస్తూ… నన్ను అరెస్టు చేయడం అనేది జరిగే పని కాదని కామెంట్ చేసింది. తనను నిర్భయంగా అరెస్టు చేసుకోవచ్చని… నీకు సాధ్యమైతే!! అంటూ కామెంట్ చేసింది. తాజాగా మీరా మిథున్ ను కేరళ లో అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు చెన్నై కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement