Saturday, April 27, 2024

విక్రమ్ ‘తంగళన్’పై బిగ్ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విక్రమ్. ఈ స్టార్ నటుడు ప్రస్తుతం దర్శకుడు రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కున్న బిగ్ బడ్జెట్ మూవీ ‘తంగళన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, విక్రమ్ పుట్టినరోజున (ఏప్రిల్ 17న) తన అభిమానులను కోసం మూవీకి సంబంధించి ప్రత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. మూవీ గ్లింప్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

తంగళన్‌ మూవీలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్ తో పాటు ఇతరులు ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమా మల్టీ ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఈ మూవీ 3D ఫార్మాట్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement