Thursday, May 2, 2024

Mega Teaser | మెగా ఫ్యాన్స్ మెచ్చేలా భోలా శంకర్ టీజర్.. స్వాగ్ తో ఆక‌ట్టుకుంటున్న చిరు

నాకు హ‌ద్దుల్లేవ్‌.. స‌రిహ‌ద్దుల్లేవ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి భోళాశంక‌ర్ సినిమాలో చెప్పే డైలాగ్‌ని అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఇవ్వాల (శ‌నివారం) కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేశారు నిర్వాహ‌కులు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ భోళా శంకర్. ఈ మూవీ ఆగస్ట్ 11న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నా భాటియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ప్రమోష‌న్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్ భోలా మానియా, మాస్ ప్రేక్ష‌కుల‌ నుండి మంచి స్పందనను అందుకుంటుంది.

కాగా, ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు మేకర్స్ ఈరోజు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌లో మెగాస్టార్ డాషింగ్ & స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎప్ప‌టిలాగానే తన మ్యానరిజమ్స్.. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరు క్యారెక్ట‌రైజేష‌న్ ను ఎలివేట్ చేయ‌డంలో మెహర్ సక్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ భారీ మూవీని నిర్మిస్తుండ‌గా.. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement