Sunday, May 5, 2024

బెదురులంక నుంచి నేహ శెట్టి ఫస్ట్ లుక్.. ‘మనసుని ముక్కలు చేసే మిషిన్​వి నువ్వు’ అంటున్న ఫ్యాన్స్

కార్తికేయ హీరో రోల్​లో నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. ఈ మూవీకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్ టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సినిమాలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది.

కాగా, ఇవ్వాల (సోమవారం) ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘బెదురులంక 2012’లో చిత్ర అనే పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తున్నారని తెలియజేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement