Wednesday, May 1, 2024

బజార్ రౌడీ ట్రైలర్ రిలీజ్

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సంపూర్ణేష్ బాబు. కాగా సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం హీరోగా నటించిన బజార్ రౌడీ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై సంధి రెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

అలాగే సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్ గా నటిస్తోంది. పృధ్వి, షియాజీ షిండే, నాగినీడు, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మరి ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సంపూర్ణేష్ బాబు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement