Saturday, May 4, 2024

త్వరలో రానా టీజర్ @ భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అయితే దుమ్ముడులుపుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలో రానా కు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోందట. ఇక విషయం తెలిసిన రానా ఫ్యాన్స్ టీజర్ ఎలా ఉండబోతుందోనని చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇక ఇందులో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా… రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement