Monday, April 29, 2024

మరో మూడు ఇంటర్నెషన్ అవార్డలు సొంతం చేసుకున్న ‘‘బలగం’’

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘బలగం’. ఈ మూవీపై అవార్డుల వర్షం కురుస్తోంది. హాస్యనటుడి నుంచి దర్శకుడిగా మారిన వేణు యెల్దండి తొలిసారిగా మెగాఫోన్ పట్టగా, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయకులుగా నటించారు. ఇటీవల, ఈ సినిమా వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు, తాజాగా ఈ మూవీ ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాంబుల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రధాన నటుడు విభాగాల్లో మరో 3 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాలగం టీమ్‌కి ఇది గర్వకారణం. బాలగంలో వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితారెడ్డి ఈ చిత్రాన్ని చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement