Sunday, April 28, 2024

అవికా బర్త్ డే…కొత్త సినిమా టైటిల్ రిలీజ్

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవిక గోర్ సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ వంటి చిత్రాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అవికా… ఇప్పుడు సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం సాయి రోనక్ హీరోగా, అవికాగోర్ హీరోయిన్ గా మురళి నాగ శ్రీనివాస్ గ్రంధం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఆచార్య క్రియేషన్స్ అధినేత బోగేంద్ర గుప్త మధుపల్లి ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు పాప్ కార్న్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement