Thursday, May 2, 2024

కలెక్షన్లలో తిరిగి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అవతార్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన అవతార్ మూవీ విడుదలయిన ఇన్నేళ్ల తర్వాత కూడా తన హవా కొనసాగిస్తోంది. వల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా అవతార్ తిరిగి నెంబర్ ర్యాంకును సాధించింది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రస్సో బ్రదర్స్ తీసిన “అవెంజర్స్ ఎండ్ గేమ్” నిలిచింది. 2019లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలా నిలవటంలో భాగంగా ఈ సినిమా జేమ్స్ కేమెరూన్ విజువల్ వండర్ ‘అవతార్’ను బీట్ చేసింది. 2.7902 బిలియన్ డాలర్స్ వసూళ్ళతో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’… ‘అవతార్’ను రెండో స్థానానికి నెట్టేసింది. దానికి ముందు దాదాపు పదేళ్ళ పాటు ‘అవతార్’ బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలవటం విశేషం.  అయితే ‘అవతార్’ను రెండో ప్లేస్ కి నెట్టేసిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ రెండేళ్ళలోనే తన టాప్ ఛైర్ ను వదిలేసుకోవలసి వచ్చింది.  ‘అవతార్’ చిత్రాన్ని ఇటీవల చైనాలో రీ-రిలీజ్ చేశారు. దాంతో అక్కడ ఈ సినిమా 3.22 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఈ మొత్తంతో కలిపి అవతార్ 2.7926 బిలియన్ వసూళ్ళను సాధించింది దీంతో మళ్లీ నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది అవతార్. అవతార్ సీక్వెల్ గా వస్తున్న అవతార్ 2 మూవీ అవెంజర్ రికార్డును బద్దలు కొడుతుందని అందరూ భావించారు. కాని అవతార్ 1 టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే అవతార్ సీక్వెల్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ కూడా కొత్త రికార్డులను క్రియెట్ చేస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement