Friday, April 19, 2024

రాదనుకున్నాం… రాధే శ్యామ్ తో వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో సిమ్రాన్ కౌర్ కూడా నటిస్తోంది. ఆ మధ్య రాధేశ్యామ్ చిత్ర యూనిట్ నుంచి ఫోన్ వచ్చింది. ఓ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు..వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలో నాది కీలకమైన పాత్ర. రాధే శ్యామ్ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్ కౌర్.

గతంలో సిమ్రాన్ కౌర్..మంచు మనోజ్ హీరోగా నటించిన పోటుగాడు సినిమా ద్వారా ఈ అమ్మడు టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం అవకాశాలు రాలేదు. ఇక ఎనిమిదేళ్ల తరువాత రాధే శ్యామ్ ద్వారా తెలుగు లో మళ్ళీ సిమ్రాన్ కౌర్ కు అవకాశం వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement