Monday, April 29, 2024

101 జిల్లాల అందగాడు… అవసరాల శ్రీనివాస్

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అవసరాల శ్రీనివాస్. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు. అంతే కాదు దర్శకుడిగా కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సెట్ చేసుకున్నాడు. అయితే బుధవారం సాయంత్రం సోషల్ మీడియా లో అవసరాల శ్రీనివాస్ నిజ స్వరూపం బయట పెడతానంటూ కో డైరెక్టర్ మహేష్ ఓ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో లో అవసరాలలో బట్ట తలతో కనిపించాడు. ఇది చూసిన కొంత మంది నిజమేనేమో అనుకున్నారు. కానీ మరి కొంత మంది మాత్రం అదంతా ప్రమోషన్స్ లో భాగమే అంటూ కొట్టి పారేశారు.

అధికారికంగా ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం 101 జిల్లాల అందగాడు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు,క్రిష్ జాగర్ జాగర్లమూడి సమర్పణలో రాచకొండ విజయ్ సాగర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రైటర్ కూడా అవసరాల శ్రీనివాస్ పని చేశారు. కాగా సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నాము అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement