Sunday, May 5, 2024

Avantika : టాలీవుడ్ కి దూసుకొస్తున్న అవంతిక…

అవంతిక వందనపు హాలీవుడ్ లో వెలుగుతున్న‌ మ‌న తెలుగ‌మ్మాయి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు వైవిధ్యమైన సంస్కృతులతో ప్ర‌త్య‌క్ష ప‌రిచ‌యం ఉన్న న‌టి. హైదరాబాద్ తో ఈ బ్యూటీ జ్ఞాప‌కాలు ఎంతో గొప్ప‌వి. ఇక్క‌డ సినిమాలు చేసింది. త‌దుప‌రి టాలీవుడ్ లో స్టార్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

- Advertisement -

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో గుర్తింపు కావాల‌ని అంటోంది. మ‌హేష్ బాబు బ్రహ్మోత్సవంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ మీన్ గర్ల్స్ తో హాలీవుడ్ లోను సెన్సేష‌న్ గా మారింది. ఇందులో కరెన్ శెట్టిగా బ్రేకవుట్ పాత్రను పోషించిన‌ అవంతిక వందనపు ప్ర‌తిభ‌కు మంచి గుర్తింపు ద‌క్కింది.

అవంతిక‌ గ్లోబల్ స్టార్‌డమ్ వైపు వ‌డి వ‌డిగా దూసుకుపోతోంది త‌దుప‌రి వెబ్ సిరీస్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రైని ప్రమోట్ చేయడానికి ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చిన 19 ఏళ్ల అవంతిక తాజా ఇంట‌ర్వ్యూలో త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. హారర్ చిత్రం టారో అండ్ క్రౌన్ ఆఫ్ విషెస్ అనే ఫాంటసీ సిరీస్‌తో అభిమానుల ముందుకు రానుంది. ఇందులో అవంతిక‌ ప్రధాన పాత్రను పోషిస్తోంది. దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా పనిచేస్తోంది. భారతదేశంలో అలాగే అమెరికాలో పని చేయడం రెండు భిన్నమైన అనుభవాలు అని కూడా తెలిపింది. భారతదేశంలో ఒక కుటుంబంతో కలిసి పని చేస్తున్నట్లు అనిపించింది.. ఇది చాలా బాగుంది కానీ కొన్నిసార్లు వ్యక్తిగత ప‌నులు, వృత్తిగ‌త‌ జీవితాన్ని ప్ర‌భావితం చేస్తాయి.

అమెరికాలో ప్రతిదీ స్పష్టమైన పని గంటలతో వ్యవస్థీకృతంగా ఉంటుంది. తక్కువ వ్యక్తిగత విష‌యాలు.. కానీ వృత్తిపరంగా స్పష్టంగా ఉంది. అమెరికా ప‌రిశ్ర‌మ‌లో నేను పోషించిన పాత్రలు మరింత సంతృప్తికరంగా అనిపించాయి. ఇటీవల నేను పెద్దయ్యాక మళ్లీ భారతీయ ప‌రిశ్ర‌మ‌ల్లో న‌టిస్తున్నాను. అది మానసికంగా నాకు బహుమతిగా అనిపించింది. నాకు లభించిన పాత్రలతో నేను చాలా అదృష్టవంతురాలిని కొత్త నటీనటులు తమ పాత్రలను ఎంచుకోవచ్చని చాలా మంది అనుకుంటారు.. కానీ అది నిజం కాదు. ప్రారంభంలో అవ‌కాశాల‌ కోసం చాలా మంది ప్రయత్నిస్తారు గ‌నుక న‌టీనటులు త‌మ‌కు కావాల్సిన‌వే ఎంపిక చేసుకోలేరు. నేను అదృష్టవంతురాలిని .. ఎందుకంటే నాకు లభించిన పాత్రలు నేను కోరుకున్నవి.. హాలీవుడ్‌లో దక్షిణాసియా నటిగా ఎలా ఉంటుందో చూపించడంలో అవి సహాయపడ్డాయి. నేను పరిశ్రమలో మంచి స్నేహితులను కూడా సంపాదించుకున్నాను.. అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement