Monday, May 6, 2024

జెర్సీ పై ప్రశంసలు కురిపించిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రజల ముందుకు వచ్చిన చిత్రం జెర్సీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అలాగే 67 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఈ సినిమాపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించారు.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బెయిలీ జెర్సీ చిత్రం అద్భుతంగా ఉందని… ట్వీట్ చేశారు. నేను జెర్సీ చూశాను. ఎంతటి భావోద్వేగ ప్రయాణం. దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. నాని గుడ్ జాబ్. అతనితో మీరు నవ్వుతారు, ఏడుస్తారు ఇందులో నాకు రైల్వే స్టేషన్ సన్నివేశం బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

Advertisement

తాజా వార్తలు

Advertisement