Monday, April 29, 2024

బ‌న్నీపై మ‌రోసారి అభిమానం చాటుకున్న‌.. డేవిడ్ వార్న‌ర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై త‌న అభిమానాన్ని మ‌రోసారి చాటుకున్నాడు ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నా కూడా ఆట విడుపు అన్నట్లుగా పుష్ప 2 సినిమా పోస్టర్ ను తన ఫేస్ మార్ఫింగ్ చేసి ఆ ఫొటోను షేర్ చేశారు. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి వార్నర్ ఇలా చూపించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అర్థనారీశ్వరుడి పాత్రలో అల్లు అర్జున్ తాజాగా సర్ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.ఆ గెటప్ కు ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ పోస్టర్ ని మార్ఫింగ్ చేసి ఇన్ స్టా లో షేర్ చేసిన డేవిడ్ వార్నర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. డేవిడ్ వార్నర్ భలే ఉన్నాడే అన్నట్లుగా అంతా అనుకుంటున్నారు. పుష్ప 2 ను కూడా వదలని డేవిడ్ వార్నర్ ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తారేమో చూడాలి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప సినిమా వార్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసే విధంగా పోస్ట్ లు చేయడం వల్ల పుష్ప 2 కి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement