Tuesday, April 30, 2024

అమెరికాలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి హంగామా

ఇప్పుడంతా జాతీరత్నాలు హంగామా నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది జాతీరత్నాలు మూవీ. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్ల బాక్సా ఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక అమెరికాలో కూడా జాతీరత్నాలు మూవీ 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో జాతీరత్నాలు మూవీ టీం యూఎస్ లో సందడి చేసింది. తమ సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఓవర్సీస్ ప్రేక్షకులకు అక్కడికి వెళ్లి థాంక్యూ చెప్తున్నారు జాతి రత్నాలు. ఒక వీకెండ్ మొత్తం అక్కడ స్పెండ్ చేయడానికి షెడ్యూల్ సిద్ధం చేసుకొని నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి అక్కడికి వెళ్లారు. ఇక అమెరికాకు వెళ్తుండగానే రచ్చ స్టార్ట్ చేశారు. హీరో నవీన్ పొలిశెట్టి.. విమానంలో ఉండగానే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు వారు అమెరికా థియేటర్లలో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. వీరి సందడి మీరు చూడండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement