Monday, April 29, 2024

అశోక్ గ‌ల్లా బ‌ర్త్ డే.. మాస్ లుక్ తో అద‌ర‌గొట్టాడు

హీరో Ashok Galla 2 ప్రాజెక్ట్‌ ఫిబ్రవరిలో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్‌ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. మేకర్స్‌ ఫస్ట్ యాక్షన్‌ వీడియోను లాంఛ్ చేశారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.యూనిక్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అశోక్‌ గల్లా మాస్‌ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో తెలుస్తోంది. ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఈ మూవీ హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలపై టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కాని ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ కాగా‌ తమ్మిరాజు ఎడిటర్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement