Monday, April 29, 2024

Arha : రెడీ, స్టార్ట్ కెమెరా.. యాక్షన్..

అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండ‌గా, అల్లు అర్హ ఈ సినిమాలో ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. కాగా ఆ మ‌ధ్య సెట్ లో సంద‌డి చేసింది. ఇప్పుడు హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ మొద‌లు కాగా, అర్హ మ‌ళ్లీ సెట్స్ కి వ‌చ్చింది. చిన్నారికి చిత్ర‌బృందం గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఇక అర్హ‌ ఇప్పటికే అల వైకుంఠ‌పురములోని ఓ మై డాడీ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌లో క‌నిపించడంతో పాటు గీతాంజ‌లి రీ క్రియేష‌న్ సాంగ్‌లోను సంద‌డి చేసింది.

అర్హ మొత్తం 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుందట. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుండగా మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిచనున్నారు.

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్-1 రిలీజ్ డేట్ వచ్చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement