Saturday, May 18, 2024

అప్సరా రాణి అద్భుతః

అప్సరా రాణి….ఈ పేరు ఇటీవల ఫేమస్ అవుతుంది. 2019లో 4 లెటర్స్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ తరువాత ఉల్లాల ఉల్లాల అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది. అయితే ఆ తర్వాత వర్మ గారి కంటపడింది. సోషల్ మీడియా వేదికగా ఆమె అందాలను చూపిస్తూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయించాడు వర్మ.

తాను దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గాపెట్టాడు. ఓటీటీ వేదికగా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ తర్వాత వర్మ తీసిన డేంజరస్ సినిమాలో కూడా నటించింది. ఇక ఆ తరువాత దశ తిరిగింది. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. మరోవైపు 26 న రాబోతున్న వర్మ డీ కంపెనీ సినిమాలోనూ ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. అలాగే గోపీచంద్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీటిమార్ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు కనిపించబోతుంది. మూడు నెలల్లోనే మూడు చిత్రాల్లో ఐటం సాంగ్స్ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా అప్సరా రాణి మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement