Friday, May 3, 2024

Anushka Shetty: క్రిష్ దర్శకత్వంలో అనుష్క ‘శీలావతి’…..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది.

లేడీ ఓరియంటెడ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇక ఈ చిత్రానికి ‘శీలావతి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ వింటుంటే.. అనుష్క మరోసారి వేశ్య పాత్రని పోషిస్తుందా..? అనే సందేహం కలుగుతుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ సినిమాలో అనుష్క.. సరోజ అనే వేశ్య పాత్రని పోషించారు. ఇప్పుడు శీలావతి టైటిల్ వింటుంటే.. మరోసారి అనుష్క వేశ్యగా కనిపించబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement