Friday, April 26, 2024

సోషల్ మీడియాలో ప్రేమని వ్యక్తం చేసిన అనుష్క

ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నారు అనుష్క. బాహుబలి సినిమా తర్వాత అనుష్క సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తోంది. ఇదిలా ఉండగా అనుష్క మామూలుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. కానీ అనుష్క సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

తన పెట్ తో కలిసి ఫోటో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. నేడు ఇంటర్నేషనల్ పెట్ డే కావడంతో ఆ ఫోటోను పెట్టి తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. మరోవైపు 40 ప్లస్ లోకి వెళ్ళిన అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయమై అభిమానులు కూడా ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారు.

https://www.instagram.com/p/CNhdwQ3jlGd/?utm_source=ig_web_copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement