Friday, April 26, 2024

పుష్ప పై మరో గాసిప్

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఊర మాస్ గా కనిపించారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు నుంచి డిసెంబర్ కి మారగా ఇప్పుడు అది కాస్తా మరింత లేట్ అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement