Wednesday, May 8, 2024

పవన్ హరీష్ సినిమాపై మరో అప్డేట్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆగస్టు నుండి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట. ఈ సినిమా కోసం నెలకు పది రోజుల చొప్పున పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర లోనూ అలాగే కొడుకు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తాడట. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.కాగా ఈసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఏమేర ఆకట్టుకుంటుంరో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement