Friday, April 26, 2024

ఖిలాడి రిలీజ్ పై మరో లేటెస్ట్ అప్డేట్ !!

మాస్ మహారాజా రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన డింపుల్ హయాతి,మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ పై గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది.

కాగా మిగిలిన షూటింగ్ పై ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రెండు పాటలు సహా ఒక నెల రోజుల లోపే జరిగే షూటింగ్ పెండింగ్ ఉందట. ఇవన్నీ అయిపోతే మంచి టైం చూసుకుని థియేటర్స్ లో రిలీజ్ చేయడమే మిగిలి ఉందట. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement