Monday, April 29, 2024

సలార్ సినిమాపై రోజుకో గాసిప్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం హైదరాబాద్ గుజరాత్ లో సెట్స్ నిర్మాణం చేసి రెడీగా ఉంచారట. నిజానికి రాధేశ్యామ్ రీషూట్ లేకపోయి ఉంటే ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యేదట. ఈ రెండు ప్లేస్ లలో కూడా వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నాడట. ఇక హోంబలే నిర్మాణ సంస్థ వారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement