Thursday, March 28, 2024

గుంటూరులో మైక్రో కంటైన్మెంట్ జోన్స్ – కమిషనర్ అనూరాధ

గుంటూరు – నగరంలో కేసులు అధికంగా నమోదు అయ్యే ప్రాంతం, లేదా అపార్ట్మెంట్ లను మైక్రో కంటైన్మెంట్ జోన్ గా గుర్తించి, కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ చల్లా అనురాధ అధికార్లను ఆదేశించారు. కమిషనర్ రోజువారీ పర్యటనలో భాగంగా కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న బ్రాడిపేట, పట్టాభిపురం ప్రాంతాల్లో మంగళవారం పర్యటించి మైక్రో కంటైన్మెంట్ జోన్ ల ఏర్పాట్ల పై అధికార్లకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కరోన పాజిటివ్ కేసులు రోజు రోజుకి అధికంగా నమోదు అవుతున్నాయని, నగర ప్రజలు, వివిధ సంస్థల నిర్వహకులు సహకరించి కోవిడ్ నిబందనలు పాటించకపోతే కోవిడ్ విలయతాండవం చేస్తుందన్నారు. ప్రదానంగా పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్ గా గుర్తించి సదరుప్రాంతాల్లో బోర్డ్ లు ఏర్పాటు చేయాలని, సున్నం, బ్లీచింగ్ చల్లించి, డిస్ ఇన్ఫెక్షన్ కోసం సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయాలని యం.హెచ్.ఓ. ఆదేశించారు. పాజిటివ్ గా నిర్ధారణ అయి హోం ఐసోలేషణ్ లో ఉండేవారు, వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు ఎట్టి పరిస్తితుల్లోను రాకూడదని, అలా వచ్చేవారి పై కోవిడ్ 19 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ లో ఉండే వారికి అందుబాటులో స్థానిక వార్డ్ వాలంటీర్ ఉంటారని తెలిపారు. ఆయా సంస్థల్లో సిబ్బంది ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, శానిటైజర్ వినియోగించేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వెంటనే సదరు సంస్థను మూసి వేసి పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేపట్టాలన్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ ల్లో వంట చేసే వారు, సప్లై చేసే వారు తప్పనిసరిగా మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకోవాలన్నారు. ప్రజలు సైతం ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం, తగిన భౌతిక దూరం పాటించడం చేయాలని, జన సమూహాలకు దూరంగా ఉండాలని కోరారు. స్వీయ నియంత్రణ లేకుంటే కరోన కట్టడి కష్ట సాధ్యమని పేర్కొన్నారు.

కాంట్రాక్టర్ లే తొలగించాలి
కాలువల నిర్మాణం అనంతరం సదరు నిర్మాణ కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని కమిషనర్ అనూరాధ సూచించారు. కాలువలు ప్రతి రోజు శుభ్రం చేయించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణ తడి పొడి విడిగా ఇచ్చే వారి నుండే తీసుకోవాలని పారిశుధ్య కార్మికులకు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులను తొలగిస్తామని, ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు రోజు కి ఒక పుష్ కాట్ వెంబడి వెళ్లి పారిశుధ్య పనులను పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్ల మీద భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి వారి నుండి అపరాధ రుసుం వసూళ్ళు చేయాలని ప్లానింగ్ కార్యదర్శులకు తెలిపారు. పర్యటనలో డిప్యూటీ సిటి ప్లానర్ హిమబిందు, యం.హెచ్.ఓ. డాక్టర్ వెంకటరమణ, డి.ఈ.ఈ. శ్రీనివాసరెడ్డి, ఏ.ఈ.లు అనూష, రాంబాబు, టి.పి.యస్. లక్ష్మణ స్వామి, బయాలజిస్ట్ ఓబులు, స్థానిక కార్పొరేటర్ ఈచంపాటి వెంకట క్రిష్ణాచారి, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవరపల్లి ప్రసాద్, మల్లేశ్వర రావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement