Monday, April 29, 2024

ప్రభాస్ లిస్ట్ లో మరో దర్శకుడు !!

ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ రెండు కూడా కంప్లీట్ కావడానికి ఇంకో రెండేళ్లపాటు టైం పడుతుంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.

అయితే మరో రెండు మూడేళ్ల పాటు ఫుల్ బిజీగా గడప బోతున్నాడు ప్రభాస్. ఈ సమయంలో మరో దర్శకుడు పేరు కొత్తగా లిస్టులో చేరింది. ఇటీవల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రశేఖర్ ఏలేటి కూడా ప్రభాస్ కు ఇటీవల ఓ లైన్ చెప్పారట. ప్రభాస్ కూడా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని కోరాడట. ప్రస్తుతం ఏలేటి దానిపై కూర్చున్నాడట. కథ పూర్తిగా రెడి అయ్యాక మరోసారి ప్రభాస్ ను కలవనున్నారట. ఒకవేళ ప్రభాస్ కు కథ నచ్చితే ఎన్ని సంవత్సరాలు అయినా సరే వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నదట చంద్రశేఖర్ ఏలేటి.

Advertisement

తాజా వార్తలు

Advertisement