Monday, April 29, 2024

అన్నీ మంచి శ‌కున‌ములే ధ‌ర్డ్ సింగిల్

హీరో సంతోష్ శోభ‌న్ న‌టిస్తోన్న తాజా చిత్రం అన్నీ మంచి శ‌కున‌ములే.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తు్స్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని మెరిసే మబ్బుల్లో అనే మెలోడి సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ సాంగ్‌ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేస్తుంది. మిక్కీ జే మేయర్‌ ట్యూని మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. అదే ఫీల్‌తో నకుల్‌, రమ్య భట్‌ ఆలపించారు. రెహమన్‌ లిరిక్స్‌ అందించాడు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజైన ప్రతీది మంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా మాళవికా నాయర్‌ నటిస్తుంది. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై స్వప్న దత్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాను నేను సినిమాతో హీరో అవతారమెత్తారు సంతోష్ శోభ‌న్. తొలి సినిమానే డిజాస్టర్‌ ఫలితాన్నిచ్చింది. దాంతో మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘పేపర్‌ బాయ్’ వంటి న్యూఏజ్‌ లవ్‌స్టోరీతో వచ్చారు. ఈ సినిమాకు క్రిటిక్స్‌ నుంచి మంచి రేటింగ్‌ లభించిన కమర్షియల్‌గా సేఫ్‌ కాలేకపోయింది. దాంతో మరో మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘ఏక్‌ మినీ కథ’ వంటి బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ప్రస్తుతం సంతోష్‌ ఆశలన్ని అన్ని మంచి శకునములే’ సినిమాపైనే ఉన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement