Sunday, May 5, 2024

బంగార్రాజు ఫ‌స్ట్ లుక్..నాగ‌చైత‌న్య లుక్ అదుర్స్..

సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా హీరో నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. కాగా నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. నవంబర్‌ 23 వ తేదీన అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. నాగచైతన్య పుట్టిన రోజున అంటే నవంబర్‌ 23 న ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేర‌కు నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర‌బృందం..పువ్వుల ష‌ర్ట్..చిరుగుల జీన్స్,,క‌ళ్ళ‌కి గాగుల్స్ తో అదిరిపోయాడు నాగ‌చైత‌న్య‌. ఈ లుక్ చైత‌న్య అభిమానుల‌కి పండ‌గ‌నే చెప్పాలి. మ‌రి చిత్రంలో చైత‌న్య పాత్ర ఎలా ఉంటుందో చూడాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement