Tuesday, May 7, 2024

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సెకండ్‌ సాంగ్‌ లాంచ్‌

‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ”ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును” అనేది ఉపశీర్షిక. పెళ్లి చూపులు, డియర్‌ కామ్రేడ్‌, దొరసాని వంటి సినిమాల నిర్మాణసంస్థ బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
’30 వెడ్స్‌ 21′ ఫేమ్‌ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ లిరికల్‌ సాంగ్‌ను దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చేతుల మీదుగా విడుదల చేశారు..


ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ” ఈ పాట నిజంగా చాలా బావుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంది. సినిమాకు మంచి వైబ్‌ ఉంది. అన్నారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ ” అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో వెన్నెల్లో ఆడపిల్ల అనే ఈ సెకండ్‌ సాంగ్‌ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఫస్ట్‌ సాంగ్‌ రంగమ్మ చాలా వైరల్‌ అయింది. ఈ సెకండ్‌ సాంగ్‌ అంతకంటే ఎక్కువ వైరల్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు-న్నాను. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తోన్న మా అందరినీ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటు-న్నాను.. అన్నారు.
హీరోయిన్‌ లావణ్య మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ విజువల్స్‌ మీకు బాగా నచ్చుతాయి. నా కో యాక్టర్స్‌ అంతా ఎంతో సహకరించారు. మేమంతా కొత్తవాళ్లమైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఇచ్చిన నిర్మాత యశ్‌ రంగినేనిగారికి ధన్యవాదాలు.. అన్నారు.

గీత రచయిత శ్రీనివాస్‌ మౌళి కూడా మాట్లాడారు. ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో చైతన్య రావ్‌, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్‌ ఆదిత్య తదితరులు నటిస్తున్నారు.
సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ, సినిమాటోగ్రఫీ : పంకజ్‌ తొట్టాడ, నిర్మాత : యష్‌ రంగినేని, రచన దర్శకత్వం: చెందు ముద్దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement