Sunday, May 19, 2024

జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్​ చేయాలి

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూల రైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెలో భాగంగా ముగ్గులు వేస్తు తమ నిరసనను వ్యక్తం చేశారు. శుక్రవారం నిజాంబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూల రైజేషన్ చేయాలని చేపట్టిన ధర్నా శుక్రవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీ ఏది అని ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అమలు చేస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో మావంతు బాధ్యతగా ప్రతి కార్యదర్శి భాగస్వాములమయ్యామని పేర్కొన్నారు. ప్రతి కార్యదర్శి ఎంతో క్రియా శీలకంగా పని చేసారు. అలాగే గ్రామాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు రావడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నాలుగు సంవత్సరాల గడువు పూర్తి అయినప్పటికి జూనియర్ పంచాయతీ కార్యదరు రెగ్యులరైజేషన్ సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోవడంపై వాపోయారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ 6.0. విడుదల చేయాలని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని, ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పిరియడ్ లో భాగంగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ని నిర్ధారించి ప్రకటించాలని పేర్కొన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యూల రైజేషన్ చేసి మా సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కృష్ణవేణి, సందీప్, విష్ణు, రామ్మోహన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement