Friday, May 17, 2024

Annapoorani | ఓటీటీలోకి నయనతార లేటెస్ట్ మూవీ..

లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. నూతన దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న‌ తమిళంలో విడుల‌య్యి.. విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. కాగా, ఈ మూవీ OTT అరంగేట్రం కోసం రెడీ అయిపోయింది. ఈ మూవీ డిసెంబర్ 29నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లలో డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి రానుంది.

జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్‌ పై జతిన్ సేథి మరియు ఆర్ రవీంద్రన్ దీనిని నిర్మించారు. ఇందులో జై, సత్యరాజ్, కెఎస్ రవి కుమార్, రెడిన్ కింగ్స్లీ, అచ్యుత్ కుమార్, కుమారి సచ్చు, రేణుక, కార్తీక్ కుమార్ మరియు సురేష్ చక్రవర్తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement