Tuesday, May 7, 2024

Anna Ben: ప్ర‌భాస్ క‌ల్కీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న అన్నా బెన్ …

ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సలార్ తో హిట్ కొట్టిన ప్రభాస్ మే 9న కల్కి సినిమాతో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా.

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కల్కి సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ భామ నటిస్తుందని సమాచారం. మలయాళం హీరోయిన్ అన్నా బెన్ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని అన్నా బెన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

మలయాళంలో కుంబలంగి నైట్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన అన్నా బెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్, సారా, కప్పేలా, కాపా.. ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టింది. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో కూడా ఓ సినిమా ఒప్పుకుంది. ఒక వైపు న‌ట‌న‌, మ‌రో గ్లామ‌ర్ ఉన్న బెన్ క‌ల్కీ హిట్ అయితే టాలీవుడ్ లో పాతుకుపోవ‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement