Monday, April 29, 2024

యానిమ‌ల్ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్.. ఏడాది చివ‌ర్లో రావ‌చ్చేమో!

బాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం అత్యంత ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ అప్ క‌మింగ్ మూవీస్‌లో రణబీర్ కపూర్ యానిమల్ ఒకటి. ఇటీవల విడుదలైన యానిమల్ ప్రీ-టీజర్, అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. అర్జున్ రెడ్డీ ఫేమ్ సందీప్ రెడ్డీ వంగా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాని ఆగష్టు 11 న రిలీజ్ చేయాల‌ని మొద‌ట మేకర్స్ భావించారు.

- Advertisement -

సందీప్ వంగా రెడ్డి దర్శకుడు కావడం తో పాటు తన తొలి సినిమా అర్జున్ రెడ్డితో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సూపర్బ్ బజ్ క్రియేట్ అయింది. యానిమల్ మూవీని ఇండిపెండెన్స్ వీకెండ్ సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు, అయితే ఇప్పుడు అది వాయిదా పడి ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement