Friday, April 26, 2024

శర్వానంద్ తో అనిల్ రావిపూడి ?

పటాస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు అనిల్ రావిపూడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడిగా మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. అయితే అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా హీరో శర్వానంద్ తో మరో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్ తో అనిల్ రావిపూడి కథ పరంగా చర్చించాడట.ఈ సినిమా ఫుల్ ఫన్ తో రానుండట.

Advertisement

తాజా వార్తలు

Advertisement