Wednesday, April 24, 2024

ఫ్యాక్ట్ చెక్: కరీంనగర్‌లో అరుస్తున్న పాము.. ఇందులో నిజమెంత?

కరీంనగర్ జిల్లాలో అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. దీంతో పామును చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారంటూ వెలిచాల గ్రామస్తుడు సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

దీనిపై స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ స్పందించారు. ఇదంతా అబద్దమని వెల్లడించారు. అసలు నిజం ఏంటంలే.. ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియో‌ని వైరల్ చేశాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఆ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు. సదరు యువకుడిని విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ‘ఈస్టర్న్‌ హాగ్‌నోస్‌ స్నేక్‌’ అంటారని.. ఇది కేవలం నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇది భారత్‌లో కనిపించదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=EuHBz3ig4QY
Advertisement

తాజా వార్తలు

Advertisement