Saturday, April 27, 2024

బాలయ్య సినిమాకు కొత్త రూట్ ఎంచుకున్న అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు.

అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం… అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఒక పాపులర్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ దర్శకులు లాగా తమన్ దేవి శ్రీ ప్రసాద్ కాకుండా ఈ సినిమా కోసం అనిల్ గా ఇప్పుడు వేరే దర్శకుడి ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ సురవరం, మోసగాళ్లు వంటి సినిమాలకు సంగీతం అందించిన శ్యామ్ సీ ఎస్ సినిమాకి సంగీతం అందించబోతున్నారట. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement