Thursday, April 25, 2024

2014లో కేసీఆర్, హరీష్ ఆస్తులెంత? ఇప్పుడెంత?: ఈటెల

హుజురాబాద్‌లో ఈటెల గెలిస్తే ప్రజలు ఓడిపోయినట్లే అని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా తనకే ఓటు వేస్తుందని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఈటెల గెలిస్తే అనేక మంది ఈటెల రాజేందర్లు ఎక్కడ పుట్టుకస్తారోనని కేసీఆర్‌కు భయం పట్టుకుందని చురకలు అంటించారు. హుజురాబాద్‌లో బీజేపీ నేతలపైనే కాదు టీఆర్ఎస్ ఇంఛార్జిలపై కూడా నిఘా ఉందన్నారు.

అందుకే హుజురాబాద్‌లోని కొందరు టీఆర్ఎస్ ఇంఛార్జులు కూడా తానే గెలవాలనుకుంటున్నారని ఈటెల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి దసరా పండుగ నడుస్తుందన్నారు. తెలంగాణలో రాజకీయ విలువలు లేవు కేవలం కేసీఆర్ అరాచకం మాత్రమే ఉందని మండిపడ్డారు. 2014లో కేసీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎన్నో.. ఇప్పుడు వారికి ఆస్తులెన్ని ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యేలను కూడా నమ్మకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది..? అని నిలదీశారు.

ఈ వార్త కూడా చదవండి: రెండు గుంటల భూమే నా ఆస్తి: గెల్లు శ్రీనివాస్ యాదవ్

Advertisement

తాజా వార్తలు

Advertisement