Friday, April 26, 2024

2 గుంటల భూమే నా ఆస్తి..పని మనిషిలా పని చేస్తా: గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్‌ ఉపఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించిన తర్వాత తొలి సారి మాట్లాడారు. నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలకు సేవ చేయమన్న సీఎం కేసీఆర్ కి పాదాభివందనం అన్నారు.. నేను పేద కుటుంబంలో పుట్టిన బిడ్డను.. విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశాను… కేసీఆర్‌ ఉద్యమ స్ఫూర్తితో పనిచేశానని వెల్లడించారు.. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినందుకు సీఎం కేసీఆర్ నన్ను గుర్తించారు… అందుకే టికెట్‌ ఇచ్చారన్నారు… ఇక, నన్ను గెలిపించండి… అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా.. ఒక పని మనిషిలా పని చేస్తాను అని విజ్ఞప్తి చేశారు గెల్లు శ్రీనివాస్.

న‌ను గెలిపించాల‌ని హ‌రీశ్ రావుకు పార్టీ నాయ‌క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పేద కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. విద్యార్థి నేత‌గా ఉద్య‌మాల్లో పాల్గొన్నాను. ద‌ళిత‌, బ‌హుజ‌న విద్యార్థుల హ‌క్కుల కోసం పోరాడాను. పార్టీ కోసం తాను చేసిన సేవ‌లు గుర్తించి సీఎం కేసీఆర్ త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. నాకు కేవలం 2 గుంటల భూమే ఆస్తి.. ఓ పని మనిషిలా పని చేస్తా.. అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని హుజురాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త‌న‌ను గెలిపిస్తే మీ ప‌ని మ‌నిషిలా సేవ చేసుకుంటాన‌ని గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి: వినేష్ ఫోగట్ కు భారీ షాక్..తాత్కాలిక నిషేధం విధించిన డబ్ల్యూఎఫ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement