Saturday, April 27, 2024

‘అమీషాప‌టేల్’ కి పెళ్ళి ప్ర‌పోజ‌ల్ .. ఎవ‌రు చేసారంటే

హీరోయిన్ అమీషాప‌టేల్ వ‌య‌సు 40దాటినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ బ‌ద్రీ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మే. కాగా రీసెంట్ గా ఈ బ్యూటీకి పెళ్లి ప్ర‌పోజ‌ల్ వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ దివంగ‌త సీనియ‌ర్ నేత అహ్మ‌ద్ ప‌టేల్ త‌న‌యుడు పైజ‌ల్ ప‌టేల్ , అమీషా ప‌టేల్ కి పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేశాడు. ఈ మేర‌కు ట్వీట్ చేశాడు కానీ చేసిన కొద్దిసేప‌ట్టికే ఆ ట్వీట్ ను తొల‌గించ‌డం విశేషం. అమీషా, ఫైజల్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ మధ్య ప్రేమ బంధం ఉన్నట్టు వీరిద్దరిలో ఎవరూ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. అయితే ఫైజల్ పుట్టినరోజు సందర్భంగా వారి ప్రేమపై ప్రచారానికి బలం చేకూర్చే ఘటన జరిగింది.

ఫైజల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమీషా పటేల్ కూడా అతడికి శుభాకాంక్షలు తెలిపింది. తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలతో కూడిన కొలాజ్ ఫ్రేమ్ ను పోస్టు చేసింది. “హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఫైజల్ పటేల్…. లవ్యూ” అంటూ పేర్కొంది. అందుకు ఫైజల్ పటేల్ స్పందిస్తూ… “థాంక్యూ అమీషా పటేల్… అందరి సమక్షంలో అడుగుతున్నాను… నన్ను పెళ్లి చేసుకుంటావా” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

http://AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement