Sunday, December 8, 2024

బిజినెస్ కోసం.. కొత్త ఇళ్లు కొన్న‌ ఆలియాభ‌ట్

ప్రొడ‌క్ష‌న్ హౌస్ కోసం కొత్త ఇళ్లు కొనుగోలు చేసింద‌ట హీరోయిన్ ఆలియా భట్. ఈమేర‌కు బాంద్రాలోని ఖరీదైన పాలిహిల్ ప్రాంతంలో రూ. 37.80 కోట్ల ఓ ఇంటిని కొనుగోలు చేసిందట‌. ఇప్పటికే ముంబైలో ఎనిమిది అంతస్థుల ఇంటిలో అలియా – రణ్ బీర్ క‌పూర్ నివాసం ఉంటున్నారు. ఈ ఇంటిలోనే అలియా తన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ కోసమే ఈ ఇంటిని కొన్నారంటూ ప్రచారం. ఇందుకు స్టాంప్ డ్యూటీనే రూ.2.26 కోట్లు చెల్లించిందంట అలియా. ఇక రెండు చేతుల సంపాదనకు సిద్ధం అవుతోంది. మరోవైపు అలియా పేరు మీదున్న రెండు ఫ్లాట్స్ ను తన సోదరి షహీన్ కి గిఫ్ట్ గా అందించిన్నట్టు కూడా తెలుస్తోంది. దాని విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని టాక్. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అలియా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అలాగే నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది. అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇక సౌత్ లో NTR30తో అలరిస్తుందని భావించిన కుదరలేదు. ఆ ఛాన్స్ జాన్వీ కపూర్ దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement