Wednesday, May 1, 2024

OMG2 : శివుడిగా అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ఏ పాత్ర‌లోనైనా ఒదిగిపోతార‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆయ‌న శివుడి పాత్ర‌లో మెర‌వ‌నున్నారు. తొమ్మిదేళ్ల క్రితం హిందీలో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఓ మై గాడ్-2 పేరుతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడుగా కనిపించనున్నాడు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీక్ సందర్భంగా ఆగస్టు 11న రిలీజ్ కానుంది. వాకావ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
పంకజ్ త్రిపాఠి కీలకపాత్రలో నటిస్తున్నాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా పస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చేతిలో ఢమరుకం పట్టుకుని జుట్టును వీరబోసుకుని ఉన్న అక్షయ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement