Friday, April 26, 2024

Exclusive Story – 70 మందితో బిఆర్ఎస్ తొలి జాబితా రెడీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటన చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో ఎలక్షన్‌ మూడ్‌ వచ్చేసింది. విపక్షాల రాజకీయ వ్యూహాలను పక్కకు నెట్టి జనం మదిలో నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పదునైన వ్యూహంతో సంసిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయని కేంద్రం పలు సందర్భాల్లో సంకేతాచ్చిన నేపథ్యంలో.. ఈసారి తెలంగాణాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తానంటే ఏమిటో చూపించాలన్న గట్టి పట్టుదలతో గులాబీ దళపతి ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో బరిలో దింపాలనుకుంటున్న అభ్యర్థులందరినీ అంతర్గతంగా సంసిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 70 మంది అభ్యర్థులతో తొలి జాబితా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు- ఎన్నికల మేనిఫెస్టోపైనా అధినేత కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.

ఎమ్మెల్యేలపై సర్వే రిపోర్టులు సిద్థం కావటంతో ఎటు-వంటి నిర్ణయాలు ఉంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. దశాబ్ది ఉత్సవాల తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎలక్షన్‌ మేనిఫెస్టోకు తుదిరూపం ఇచ్చి సీఎం కేసీఆర్‌ రాజకీయ చదరంగంలోకి దిగుతారని ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. జాతీయ పార్టీగా దేశ ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే ధ్యేయంగా మరొకటి మేనిఫెస్టోలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ కోణంలో అనేక అంశాలపై సీఎం కేసీఆర్‌ మేథోమథనం ఇప్పటికే తొంభై శాతం పూర్తయింది. అభ్యర్థుల రాజకీయ స్థితిగతులపై అసెంబ్లి నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వే రిపోర్టులపై అధినేత అధ్యయనం కూడా దాదాపు పూర్తయ్యింది. ఈ క్రమంలో అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రత్యేక బృందం కసరత్తు చేస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. త్వరలో మరోసారి జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎన్నికల వ్యూహంపై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గెలిచి హ్యాట్రిక్‌ విజయం నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా ఎక్కడ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలనే అంశంపై స్పష్టతకు వచ్చినట్లు- తెలుస్తోంది. పనితీరు మెరుగుపడని ఎమ్మెల్యేల విషయంలో తుది జాబితా ప్రకటన ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరిగిన సర్వే అంశాలను, తాజా పరిణామాలను, ప్రతిపక్షాల వ్యూహాలను ప్రస్తావిస్తూ పార్టీ బలోపేతానికి మార్గదర్శకాలు, ప్రజలతో మమేకమయ్యేందుకు వ్యూహాలతో అధినేత కేసీఆర్‌ మార్గనిర్దెెశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహాలతో పాటు-గా ప్రజలకు ఇచ్చే హామీలపైనా పార్టీ సీనియర్ల కమిటీ-తో సమాలోచనలు జరుపనున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కమిటీ- ద్వారా కసరత్తు జరిపి- దసరా నాడు అధికారికంగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి 100 సీట్లలో గెలుపు లక్ష్యంగా గులాబీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సర్వేల్లో వెనుక వరుసలో ఉన్న ఎమ్మెల్యేలకు చివరి మూడు నెలలుగా సెప్టెంబర్‌ వరకు అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

అధినేత అమ్ముల పొదిలో అస్త్రాలు అనేకం!
ఈ సారి అన్ని వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకొనే విధంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలు, వాగ్దానాల అస్త్రాలతో అమ్ముల పొదిని సిద్ధం చేసుకుంటు-న్న గులాబీ బాస్‌.. ఏ పథకాలను బయటకు బయటకు తీస్తారు? ఓటర్లను ఎలా ఆకట్టు-కుంటారనేది ఆసక్తికరంగా మారింది. మహిళలు, రైతులే టార్గెట్‌గా పలు పథకాలను అమలు చేసే ఆలోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్టు- తెలుస్తోంది. ఇక దేశం అబ్బురపడే స్కీం ఒకటి తన దగ్గర ఉందని, అది అమలు చేస్తే ప్రతిపక్షాలు ఆగమవుతాయని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌.. దానిపైనా కాస్త గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు- సమాచారం. ఇంతకూ ఆ స్కీం ఏంటనేది ఆ పార్టీ నేతలకు సైతం తెలియదు. సరైన -టైమ్‌లో దాన్ని బయటకు తీసి విపక్షాలను షాక్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

- Advertisement -

హ్యాట్రిక్‌పై బీఆర్‌ఎస్‌లో గట్టి ధీమా..
హ్యాట్రిక్‌ పక్కా.. బీఆర్‌ఎస్‌కు 95 సీట్లు- గ్యారంటీ-.. సౌత్‌ ఇండియాలో థర్డ్‌ -టైమ్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు తథ్యం. ఇలాంటి ఎన్నో అంశాలపై మంత్రులు, గులాబీ నేతల నుంచి గట్టీ ధీమా వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు, వాగ్దానాలతో సరికొత్త అస్త్రాల పొదిని దాదాపు సిద్ధం చేశారు. సరైన సమయం చూసుకుని పథకాలను బయటకు తీసి విపక్షాలకు షాక్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ భావిస్తున్నది. దేనికెంత ప్రాధాన్యత ఉంటు-ందనే లెక్కలపై కూడా క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. ప్రజల స్పందనను పసిగడుతున్నాయి. సరికొత్త సంక్షేమ పథకాలతో పవర్‌లోకి రావాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు అమలవుతున్న వెల్ఫేర్‌ స్కీమ్‌లకు కొన్ని మార్పులు చేయడంతో పాటు- బలమైన హామీని ఇచ్చి ఓటర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏ స్కీమ్‌తో ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వస్తున్నదో ఇం-టె-లిజెన్స్‌ వర్గాలు ఇప్పటికే ఆరా తీసి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement