Sunday, May 5, 2024

పొన్నియన్ సెల్వన్: రాణి పాత్రలో మెరిసిపోతున్న ఐశ్వర్యరాయ్..

అందాల సుందరీ ఐశ్వర్యారాయ్ నటిస్తున్న తాజా చిత్రం “పొన్నియన్ సెల్వన్”. మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఐష్ పిక్ ఒకటి లీకైంది. ఈ పిక్ లో ఐశ్వర్య ఎరుపు రంగు పట్టు చీర, భారీ బంగారు ఆభరణాలను ధరించింది. ఈ లుక్‌లో ఐశ్వర్య రాణిలాగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో గురించే బీ టౌన్ చర్చించుకుంటుంది. మరో ఆసక్తికర విషయం ఏమంటే ఐష్ ఇందులో తల్లీకూతుళ్లుగా ద్విపాత్రాభినయం చేయబోతోంది. మందాకిని అనే తల్లి పాత్ర, నందిని అనే కూతురు పాత్ర. సెట్లో గాలి కోసం ఆమె చేతిలో ఫ్యాన్ పట్టుకుని ఉంది. చిత్ర బృందం మొత్తం ఐశ్వర్య చుట్టూ కనిపిస్తుంది.

“పొన్నియన్ సెల్వన్”తో చాలాకాలం తరువాత సౌత్ స్క్రీన్స్ పై మెరవడానికి సిద్ధమవుతోంది ఐష్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినిమా సెట్స్ నుంచి ఐశ్వర్య లుక్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్యతో పాటు విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ రవి, ఐశ్వర్యలక్ష్మి తదితరులు. ఈ సినిమాను మణిరత్నం 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన దక్షిణాన పవర్ ఫుల్ రాజు రాజరాజ చోళుని కథ “పొన్నియన్ సెల్వన్” నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ వర్క్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కోసం ఐశ్వర్య మధ్యప్రదేశ్ వెళ్లింది. ఇటీవల ఆమె ముంబైకి తిరిగి వచ్చింది.

ఇది కూడా చదవండి: కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు: సీఎస్ సోమేశ్ కుమార్..

Advertisement

తాజా వార్తలు

Advertisement