Friday, May 3, 2024

అహింస రిలీజ్.. ఎప్పుడంటే

అహింస చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు హీరో రానా త‌మ్ముడు అభిరామ్. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తేజ తెర‌కెక్కిస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ – సురేశ్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో, హీరోయిన్ గా గీతిక పరిచయమవుతోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అనే విషయం టీజర్ .. ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమా ఈ పాటికే థియేటర్లకు రావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన రిలీజ్ విషయంలో ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ సినిమాను జూన్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement