Wednesday, May 1, 2024

Movie Time | ‘అదుర్స్’​ అనిపించనున్న చారీ, భట్టు కామెడీ.. థియేటర్లలో రీ-రిలీజ్​కు రెడీ!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం శివ కొరటాల దర్శకత్వంలో యాక్షన్ ప్యాక్డ్ డ్రామా దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే మూవీలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తన‌ట్టు తెల‌స్తోంది. కాగా, తార‌క్ సూపర్ హిట్ మూవీస్ లో ఒకదాని గురించి అద్భుతమైన అప్‌డేట్‌ను ఇవ్వాల బ‌య‌టకి వ‌చ్చింది. తారక్‌ ఇండస్ట్రీకొచ్చి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తారక్‌ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్‌లలో ఒక‌టైన మూవీ అదుర్స్ రీరిలీజ్ కానుంది. ఈ సినిమాను నవంబర్‌ 18న 4K ప్రింట్‌తో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

ఈ సినిమాలో బ్రాహ్మణుడిగా తారక్‌ నటన వర్ణనాతీతం.. ఇక గురు శిశ్యులుగా బ్రహ్మీ, తారక్‌ మధ్య పండిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వీరిద్ధరి ఎక్స్‌ప్రెషన్లు మీమ్స్‌ రూపంలో రోజు వందల సార్లు చూస్తుంటాం. వీరిద్దరే అని కాదు, సినిమాలో ప్రతీ పాత్ర మనల్ని ఎంతో ఎంటర్‌టైన్‌ చేసింది. వివి వినాయక్‌ మార్క్‌ యాక్షన్‌తో పాటు ఫ్రెష్‌ కామెడీ, కిక్కిచ్చే దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం ఇలా ప్రతీది ఒక మాస్‌ ప్యాకేజిలా అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement