Saturday, May 4, 2024

ఓటీటీలోకి ఆదిపురుష్‌.. ఎక్క‌డ స్ట్రీమ్ అవుతుందంటే..

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ష‌న్ లో భారీ బడ్జెట్‌తో రామాయణం ఇతివృత్తంగా వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా.. భారీ అంచనాలతో జూన్‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ కి మిక్స్డ్ రివ్యూస్ వ‌చ్చాయి. కాగా, తాజాగా ఎలాంటి న్యూస్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది ఈ మూవీ.

ప్ర‌స్తుతం ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, హిందీ వెర్షన్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే ఆదిపురుష్ అన్ని వివాదాలు చుట్టిముట్టినా సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లే రాబట్టింది. ఇక ప్రస్తుతం సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలపైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement